ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి
గణపురం: విద్యుత్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మన్ సుంకు సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గణపురం మండలం చెల్పూరు కేటీపీపీ ప్రధాన గేట్ ఎదుట గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ 23 వేల మంది కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఏపీ ఎస్సీబీ రూల్స్(కన్వర్షన్) ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డిసెంబర్ మొదటివారంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమ్మెకు సైతం సిద్ధంగా ఉన్నామని తెలిపారు.


