అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
● కేవీఐబీ రిటైర్డ్ డైరెక్టర్ అశోక్‌కుమార్
కాటారం: నిరుద్యోగ యువత ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని కేవీఐబీ రిటైర్డ్ డైరెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈపై మంగళవారం కాటారం ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహన కల్పించారు. ఎంటర్‌ప్రినర్ డెవలప్‌మెంట్ సెల్ ద్వారా మండలాల్లోని సదుపాయాలను ప్రతి ఒక్కరికీ చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పారిశ్రామికవేత్తలు మండలాల్లో తయారీ రంగాలు, సేవా రంగాల్లో యువతను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో వనరులను వినియోగించి ఇండస్ట్రీ పెట్టడానికి ఉన్న సదుపాయాలను ఇండస్ట్రీ సెట్ అప్ తెలియజేయడానికి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లేట్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, ఈడీసీ మేనేజర్ వెన్నెల, అసిస్టెంట్ మేనేజర్ నరేందర్, ఎంపీడీఓ బాబు, రాజశేఖర్ పాల్గొన్నారు.


