టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Nov 26 2025 6:21 AM | Updated on Nov 26 2025 6:21 AM

టెట్‌

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

భూపాలపల్లి అర్బన్‌: ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నక్క తిరుపతి, కొత్త కుమారస్వామి కోరారు. ఈ మేరకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఈ మెయిల్‌ ద్వారా ఉత్తరాలు పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను కలిసి వినతి పత్రాలు అందజేస్తామన్నారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా తీర్పుపై సమీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. డీఎస్సీ పరీక్ష రాసి ఉపాధ్యాయులుగా ఎంపికై న వారిని ఇప్పుడు అర్హత పరీక్ష రాయాలి అనడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంపత్‌, సుకుమార్‌, రాజుకుమార్‌, కన్నయ్య, సురేష్‌, హరిప్రసాద్‌, తిరుపతి, కుమారస్వామి పాల్గొన్నారు.

నల్ల బ్యాడ్జీలు ధరించి

నిరసన

భూపాలపల్లి అర్బన్‌: కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏరియాలోని సింగరేణి గనుల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య మాట్లాడుతూ.. కేంద్ర న్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లు మార్చి కార్మికులను కార్పొరేట్లకు కట్టు బానిసలుగా మార్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనార్దన్‌, నర్సయ్య, ప్రసాద్‌రెడ్డి, శంకర్‌, శ్రీనివాస్‌, పవన్‌, మల్లేష్‌, సాజిత్‌ పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణానికి కృషి

చిట్యాల: మండలంలోని నైన్‌పాక గ్రామంలోని నాపాక ఆలయాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ సర్కిల్‌ ఆధికారిని రోహిణి మంగళవారం సందర్శించి ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఒకే శిలకు నాలుగు దేవతామూర్తులు కలిగిన ఆలయం ఉండడం దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. అనంతరం ఆలయం చుట్టు, ప్రాంగణం కొలతలు తీసుకున్నారు. ఆలయ అభివృద్ధి కోసం, పర్యాటకులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. ఆమె వెంట ఆలయ పూజారి పెండ్యాల ప్రభాకరాచార్యులు, ఆలయ చైర్మన్‌ యాదండ్ల రాజయ్య, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, గ్రామస్తులు ఉన్నారు.

బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలి

భూపాలపలి అర్బన్‌: విధులు నిర్వర్తిస్తూ మృతిచెందిన మున్సిపల్‌ కార్మికుడు బొల్లి రాజయ్య కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు. బొల్లి రాజయ్య విధి నిర్వహణలో మృతిచెందితే అధికారులు వారిపై చూపే నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు, బీఆర్‌ఎస్‌ నాయకులు సదానందం, వెంకన్న, బాబు, రాజన్న, బద్రి, రవీందర్‌ పాల్గొన్నారు.

టెట్‌ నుంచి  మినహాయింపు ఇవ్వాలి
1
1/3

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

టెట్‌ నుంచి  మినహాయింపు ఇవ్వాలి
2
2/3

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

టెట్‌ నుంచి  మినహాయింపు ఇవ్వాలి
3
3/3

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement