రిజర్వేషన్లను పునఃపరిశీలించాలి | - | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లను పునఃపరిశీలించాలి

Nov 25 2025 10:18 AM | Updated on Nov 25 2025 10:18 AM

రిజర్

రిజర్వేషన్లను పునఃపరిశీలించాలి

రిజర్వేషన్లను పునఃపరిశీలించాలి

భూపాలపల్లి రూరల్‌: మహాముత్తారం, పలిమెల మండలాల్లో గ్రామపంచాయతీల రిజర్వేషన్లలో ఉన్న లోపాలపై పునఃపరిశీలించి సవరణ చేయాలని బీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో సోమవారం అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌కు వినతి ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. మహాముత్తారం, పలిమెల మండలాల్లో బీసీలకు కేటాయించలేదన్నారు. వార్డుల్లోనూ బీసీలకు ప్రాధాన్యం కల్పించలేదని చెప్పారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో జేఏసీ నాయకులు పైడిపెల్లి రమేష్‌, క్యాతరాజు సాంబమూర్తి, గట్ల రాజన్న తదితరులు ఉన్నారు.

దేశభక్తిని

పెంపొందించుకోవాలి

చిట్యాల: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశిధర్‌రెడ్డి అన్నారు. వందేమాతరం జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం మండలకేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిశిధర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. వందేమాతరం గేయం భారత స్వాతంత్య్ర సమరంలో ప్రజలకు స్ఫూర్తి దాయకంగా మారి దేశవ్యాప్త ఉద్యమాలకు ప్రేరణ ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

అక్రమ రవాణాను

అరికట్టేందుకు చెక్‌పోస్టు

కాళేశ్వరం: మహారాష్ట్ర మీదుగా ధాన్యం అక్రమ రవాణాకు చెక్‌పెట్టేందుకు ఖరీఫ్‌ సీజన్‌లో చెక్‌పోస్టును ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి (డీసీఎస్‌ఓ) కిరణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం మహాదేవపూర్‌ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి ధాన్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్‌, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారి బృందాలు రెండు షిఫ్టులుగా 24/7 విధుల్లో ఉంటూ ఈ తనిఖీ కేంద్రం ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ మహదేవపూర్‌ రామారావు, మండల వ్యవసాయ అధికారి సుప్రజ్యోతి, సివిల్‌ సప్లై విభాగం డీఎం రాములు, కాళేశ్వరం ఎస్సై జి.తమాషారెడ్డి, ఆర్‌ఐ సురేందర్‌రెడ్డి, రఘు, జీపీఓ శ్యామ్‌ పాల్గొన్నారు.

ఆపరేటర్ల సమస్యలు

పరిష్కరించాలి

భూపాలపల్లి అర్బన్‌: మీసేవ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, నూతన మీ సేవల ఏర్పాట్లను విరమించుకోవాలని తెలంగాణ మీసేవ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొత్త కిరణ్‌కుమార్‌ కోరారు. వాట్సప్‌ ద్వారా మీసేవ సర్వీసులను రద్దు చేయాలని, నూతన మీ సేవ కేంద్రాల ఏర్పాటును విరమించుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా వ్యాప్తంగా మీ సేవల బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. పది సంవత్సరాల క్రితం నుంచి ఉన్న కమిషన్‌ విధానమే నేటికీ కొనసాగుతుందని కమిషన్‌ పెంచాలని కోరారు. కొద్దిపాటి కమిషన్‌తోనే మీ సేవలో నడిపిస్తున్నామని, పెరిగిన ఖర్చులతో ఇబ్బందికరంగా మారిందన్నారు. గతంలో తొలగించిన సర్వీసులు తిరిగి పునరుద్ధరించాలని, జీవనోపాధి భద్రత దృష్ట్యా భరోసా కల్పించే విధంగా ఉత్తర్వులు అందించాలన్నారు.

రిజర్వేషన్లను  పునఃపరిశీలించాలి
1
1/3

రిజర్వేషన్లను పునఃపరిశీలించాలి

రిజర్వేషన్లను  పునఃపరిశీలించాలి
2
2/3

రిజర్వేషన్లను పునఃపరిశీలించాలి

రిజర్వేషన్లను  పునఃపరిశీలించాలి
3
3/3

రిజర్వేషన్లను పునఃపరిశీలించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement