పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 28న టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించనున్న ఉద్యోగుల సమస్యల పరిష్కార సభ వాల్ పోస్టర్‌ను సోమవారం జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. కలెక్టరేట్‌లో ఆవిష్కరించిన ఈ కార్యక్రమానికి టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు బూరుగు రవి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలు చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 2023 సంవత్సరం నుంచి ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, పెండింగ్ డీఏలు విడుదల చేయాలన్నారు. ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. పంచాయతీ కార్యదర్శుల, కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దశరథ రామారావు, వరంగల్ జిల్లా కా ర్యదర్శి గాజే వేణుగోపాల్, రాష్ట్ర బాధ్యులు రామునాయక్, బింగి సురేష్, లక్ష్మి ప్రసాద్ పాల్గొన్నారు.


