రాష్ట్రస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థి.. | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థి..

Nov 24 2025 7:40 AM | Updated on Nov 24 2025 7:40 AM

రాష్ట్రస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థి..

రాష్ట్రస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థి..

కాటారం: కాటారం మండలకేంద్రంలోని గిరిజన గురుకుల సంక్షేమ బాలుర పాఠశాలకు చెందిన నిఖిల్‌ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయి అండర్‌ 17 విభాగం ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 25న యాదాద్రి భువనగిరిలో జరగనున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో వరంగల్‌ జట్టు తరఫున నిఖిల్‌ పాల్గొననున్నట్లు ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జైపాల్‌, ప్రిన్సిపాల్‌ రాజేందర్‌ తెలిపారు. ఈ మేరక వైస్‌ ప్రిన్సిపాల్‌ మాధవి, జూనియర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ వెంకటయ్య, పీడీ మహేందర్‌, పీఈటీ మంథెన శ్రీనివాస్‌, కోచ్‌ వెంకటేశ్‌, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement