ఎస్పీగా బాధ్యతల స్వీకరణ
భూపాలపల్లి: జిల్లా ఎస్పీగా సిరిసెట్టి సంకీర్త్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2020 బ్యాచ్‌కు చెందిన ఈయన రాష్ట్ర గవర్నర్‌కు ఏడీసీగా పని చేస్తున్నారు. ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ఎస్పీగా ఉన్న కిరణ్ ఖరేను హైదరాబాద్ సౌత్‌జోన్ డీసీపీగా, సంకీర్త్‌ను భూపాలపల్లి ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సంకీర్త్ ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా వచ్చిన ఎస్పీని జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.


