రిజర్వేషన్లు ఖరారు
భూపాలపల్లి: పల్లెపోరుకు అంతా సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు రెడీ అయ్యారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగా ఈ నెల 26, 27 తేదీల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉండటంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. గెలుపు గుర్రాల కోసం పార్టీలు అన్వేషిస్తుండగా ఆశావహులు ఇప్పటి నుంచే పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ఈమేరకు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమై, సెప్టెంబర్ 27న రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. కాగా రిజర్వేషన్లు 50 శాతం కంటే మించరాదని కోర్టు ఆదేశాలు ఇవ్వడం, గవర్నర్ వద్ద రిజర్వేషన్ల బిల్లు పెండింగ్‌లో ఉండటంతో చేసేది లేక పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సర్పంచ్, వార్డు స్థానాలకు ఆదివారం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మొదలైన ఎన్నికల సందడి
ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్, వార్డు స్థానాలకు బరిలో నిలిచేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వంలో వివిధ ప్రభుత్వ పథకాల నిర్వహణకు లక్షలాది రూపాయలు వెచ్చించి బిల్లులు రాక సర్పంచ్‌లు తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొన్నారు. దీంతో గతంలో సర్పంచ్ గిరి చేసిన వారిలో కొందరు మాత్రమే ఈ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతుండగా కొత్తవారు, యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో పోటీలో నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయా పార్టీల నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాగా పార్టీల నేతలు మాత్రం గెలుపు గుర్రాల కోసం గ్రామాల్లో అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది.
జిల్లాలో 248 సర్పంచ్
2,102 వార్డు స్థానాలు
సర్పంచ్, వార్డు స్థానాలకు
రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి
పార్టీ నేతల చుట్టూ
ఆశావహుల ప్రదక్షిణలు
అభ్యర్థుల ఎంపికపై పార్టీల నజర్
గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం
మండలాల వారీగా సర్పంచ్ రిజర్వేషన్లు
మండలం జీపీలు ఎస్టీ జీపీలు ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్
భూపాలపల్లి 26 2 3 4 5 12
చిట్యాల 26 2 1 5 6 12
గణపురం 17 0 1 3 4 9
కాటారం 24 0 2 8 2 12
కొత్తపల్లిగోరి 16 1 0 3 4 8
మహదేవపూర్ 18 0 2 4 3 9
మహాముత్తారం 24 0 8 4 0 12
మల్హర్ 15 1 1 3 3 7
మొగుళ్లపల్లి 26 0 0 6 7 13
పలిమెల 8 1 2 1 0 4
రేగొండ 23 0 1 4 6 12
టేకుమట్ల 25 0 0 6 6 13
మొత్తం 248 7 21 51 46 123
మండలాలు: 12
గ్రామ పంచాయతీలు : 248
వార్డు స్థానాలు : 2,102
పురుష ఓటర్లు : 1,47,388
మహిళ ఓటర్లు : 1,54,744
ఇతరులు : 15
మొత్తం ఓటర్లు : 3,02,147
జిల్లా వివరాలు..
రిజర్వేషన్లు ఖరారు


