నత్తనడకన పనులు | - | Sakshi
Sakshi News home page

నత్తనడకన పనులు

Nov 24 2025 7:40 AM | Updated on Nov 24 2025 7:40 AM

నత్తన

నత్తనడకన పనులు

మేడారం మహాజాతరకు

సమీపిస్తున్న గడువు

మిగిలింది ఇంకా 65రోజులే..

కొనసాగుతున్న అభివృద్ధి పనులు

డిసెంబర్‌ 20 కల్లా పనులు

పూర్తిచేయాలని మంత్రుల ఆదేశం

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల మహాజాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ మహాజాతరకు ఇంకా 65 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. డిసెంబర్‌ 20 కల్లా ప నులన్నీ పూర్తి చేయాలని మంత్రులు ఆయా శాఖల అధికారులను ఆదేశించినా డెడ్‌లైన్‌ నాటికి పనులు పూర్తయ్యేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

హడావుడిగా రోడ్డు విస్తరణ పనులు

మేడారం కాలనీ నుంచి ఊరట్టం స్తూపం వరకు 3 కిలోమీటర్ల వరకు రూ. 27 కోట్లతో ఆర్‌అండ్‌బీశాఖ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. 3 కిలో మీటర్ల మేర పనులు చేపట్టగా ప్రస్తుతం 1.2 కిలో మీటర్ల వరకు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. మిగిలిన పనులు సాగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన సమీక్షలో మంత్రులు డెడ్‌లైన్‌ విధించడంతో పనుల్లో పురోగతి కోసం హడావుడిగా చేపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డిసెంబర్‌ నెలాఖరు వరకు పనులు పూర్తి చేస్తామని ఈఈ శ్యామ్‌సింగ్‌ తెలిపారు.

ఆర్‌డబ్ల్యూఎస్‌ పనులు అక్కడే..

మేడారంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆధ్వర్యంలో మేడారంలో ఓహెచ్‌ఆర్‌ వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం పనులు మాత్రమే సాగుతున్నాయి. తాత్కాలిక జీఐ షీట్స్‌ మరుగుదొడ్లు, తాగునీటి పైపులైన్‌ పనులు మొదలు కాలేదు. మేడారంలో తాగునీటి కోసం 65 బోర్లు, 120 చేతి పంపులు ప్లషింగ్‌ పనులు చేస్తున్నారు. జంపన్నవాగు పరిసరాల్లో మిని వాటర్‌ ట్యాంకుల మరమ్మతుల పనులతో పాటు జీఐ షీట్స్‌ మరుగుదొడ్ల నిర్మాణాలకు తాడ్వాయి గోదాం నుంచి కాంట్రాక్టర్లకు మెటీరియల్‌ను అప్పగించారు. వరి కోతల కారణంగా టాయిలెట్లు, తాగునీటి పనులు మొదలు కాలేదని అధికారులు చెబుతున్నారు.

ప్రహరీ పనులు అంతంతే..

అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. సా లహారం(ప్రహరీ) నిర్మాణం పనుల్లో భాగంగా గద్దెల చుట్టూ బీమ్‌ నిర్మాణం పనులు పూర్తవ్వగా ఆ ర్చీల నిర్మాణానికి ఇంకా కొంత మేరకు సీసీ పనులు నడుస్తున్నాయి. ప్రస్తుతం పూర్తయిన బీమ్‌లపై రా తి పిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారు. పగిడిద్దరాజు, గో విందరాజు నూతన గద్దెల నిర్మాణానికి స్టోన్స్‌ ఏ ర్పాటు చేస్తున్నారు. గద్దెలప్రాంగణం పునర్నిర్మా ణం సమయానికి పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా లక్ష్యం నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు దీమా వ్యక్తం చేస్తున్నారు.

12 బావుల్లో పూడికతీత పూర్తి..

ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో జంపన్నవాగులో 22 ఇన్‌ఫిల్టరేషన్‌ బావుల్లో పూడికతీత పనులు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 12బావుల్లో పూడిక పనులు పూర్తయాయి. ఇంకా ఇసుక లెవంలింగ్‌ పనులు మొదలు పెట్టాల్సి ఉంది. వాగులో ఇసుక వరదకు కొట్టుకపోవడంతో బయట నుంచి లెవలింగ్‌ కోసం ఇసుక తీసుకొచ్చి పోయాల్సి వస్తుందని డీఈఈ సదయ్య తెలిపారు. త్వరలో స్నానఘట్టాల పై భక్తుల జల్లు స్నానాల కోసం బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్స్‌ ఏర్పాటుకు మెటీరియల్‌ తీసుకొస్తామని వివరించారు.

డ్రెయినేజీ పనులు అస్తవ్యస్తం

పీఆర్‌శాఖ ఆధ్వర్యంలో మేడారంలో 7 కిలోమీటర్ల డ్రెయినేజీ పనులు సాగుతున్నాయి. రెడ్డిగూడెంలో కిలోమీటన్నర డ్రెయినేజీ పనులు ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు. కొన్నిచోట్ల సైడ్‌వాల్‌ నిర్మాణం పనులు సమానంగా ఉండకుండా అడందిడ్డం చేస్తున్న విషయం అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఈ పనులపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు పనులు చేయాలని కార్మికులను మందలించారు. డ్రెయినేజీల నుంచి నీటి సరఫరా సాఫీగా వెళ్లేలా సమాంతరంగా సరిచేయాలని ఆదేశించారు.

నత్తనడకన పనులు1
1/2

నత్తనడకన పనులు

నత్తనడకన పనులు2
2/2

నత్తనడకన పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement