ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్ ప్రవేశ పరీక్ష
భూపాలపల్లి అర్బన్: జిల్లావ్యాప్తంగా రెండు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 245 మంది విద్యార్థులకు 240 మంది, కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 136 మందికి 130 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్షాకేంద్రాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు, 144 సెక్షన్ విధించి, వైద్య శిబి రాలు ఏర్పాటు మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సిట్టింగ్ స్వ్కాడ్, రెండు ప్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
టెక్నికల్ కోర్సుల
పరీక్ష ఫీజు చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: టెక్నికల్ కోర్సు సర్టిఫికెట్ డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరీక్ష ఫీజును చెల్లించాలని జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి మాసంలో పరీక్షలు ఉంటాయని, ఆసక్తి గల విద్యార్థులు ఏడో తరగతి ఉత్తీర్ణులైతే లోయర్ గ్రేడ్ పరీక్షకు, లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణులైనవారు హయ్యర్ గ్రేడ్ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నా రు. ఎటువంటి అపరాధం రుసుం లేకుండా డి సెంబర్ 5వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. రూ.50 అపరాధ రుసుంతో డి సెంబర్ 12వ, రూ.75 అపరాధ రుసుంతో డి సెంబర్ 19వ తేదీ వరకు బ్యాంకు డీడీ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు.
యాదవ సంఘం
జిల్లా కమిటీ
భూపాలపల్లి రూరల్: జిల్లా యాదవ హక్కుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కు దేవేందర్ యాదవ్ తెలిపారు. జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు పంచిక మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో కమిటీ ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా అక్కల బాపుయాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట్ల శ్రీశైలం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ బియ్యాని పూర్ణచందర్, జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జ్ కాడవేన రాకేష్, టేకుమట్ల మండల అధ్యక్షుడు భాషవేన రాజేందర్, కమిటీ సభ్యులు ఆరబోయిన వెంకటేష్, శేషగిరి యాదవ్‌లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పంచిక కుమార్ స్వామి యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దొంగల రాజేందర్, మాదం మధు, ఆవుల సంతోష్, రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు.
వేయిస్తంభాల ఆలయంలో క్లీనింగ్ డ్రైవ్
హన్మకొండ కల్చరల్: వరల్డ్ హెరిటేజ్ వీక్ పురస్కరించుకుని స్వచ్ఛత అభియాన్ క్లీనింగ్ డ్రైవ్‌లో భాగంగా వేయిస్తంభాల ఆలయంలో ఆది వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించా రు. దేవాలయ పురావస్తుశాఖ జిల్లా అధికారి అజిత్, కో–ఆర్డినేటర్ నిరంజన్, ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, పు రావస్తుశాఖ, దేవాదాయశాఖ సిబ్బంది, స్వ చ్ఛందంగా తరలివచ్చిన విద్యార్థులు పాల్గొని చీపురుకట్టలతో, పారలతో దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. అధికారి అజిత్ విద్యార్థులతో, పురావస్తుశాఖ సిబ్బందితో ప్రమాణ ప త్రం చదివించి ప్రమాణం చేయించారు.
ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్ ప్రవేశ పరీక్ష


