సేవ, ధర్మ మార్గం అనుసరించాలి
భూపాలపల్లి అర్బన్: సత్యసాయిబాబా చూపిన సేవ, ధర్మ మార్గం అనుసరణీయమని జిల్లా యువజన సర్వీసులు క్రీడల శాఖ అధికారి (డీవైఎస్‌ఓ) సీహెచ్ రఘు తెలిపారు. కలెక్టరేట్‌లో ఆదివారం సత్యసాయిబాబా శత జయంతి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో సత్యసాయిబాబా చిత్ర పటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే పరమావధిగా సేవా కార్యక్రమాలు చేపట్టి విశిష్ట స్థానం సంపాదించారన్నారు. ప్రేమ, ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసులు శాఖ, సంక్షేమ శాఖల సిబ్బంది రఘు, కృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


