రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
కాళేశ్వరం: మహదేవపూర్ జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల తొమ్మిదవ తరగతి విద్యార్థి పెద్ది స్నేహ రాష్ట్రస్థాయి హెచ్‌జీఎఫ్ ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ గుర్సింగ పూర్ణిమ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల హనుమకొండ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో 18న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఖోఖో పోటీలు నిర్వహించగా.. అండర్ 17 ఖోఖో విభాగంలో భూపాలపల్లి జిల్లా తరఫున అత్యంత ప్రతిభ కనపరిచినట్లు తెలిపారు. ఈనెల 23 నుంచి 25 వరకు భువనగిరిలో జరగబోయే రాష్ట్రస్థాయి హెచ్‌జీఎఫ్ పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం జి.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ స్నేహ రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి.సరిత, మధు, సుధారాణి, సరితా దేవి, వలిపాషా, శ్రీనివాస్, వసుదప్రియ, వీరేశం, సమ్మయ్య, లీలారాణి, రజిత, షాహెదాబేగం, ప్రసూన, దీపిక, ఆంజనేయులు, అంజద్ పాషా పాల్గొన్నారు.


