కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర
కాటారం/మల్హర్: ఽవరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందని ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి అన్నారు. కాటారం మండలం రేగులగూడెం, మల్హర్ మండలం కొయ్యూరు, వల్లెకుంట, ఎడ్లపల్లి, కొండపేట గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రైతుకు సంబంధించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా కొనుగోళ్లు సాగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల, పీఏసీఎస్ చైర్మన్ తోటపల్లి ప్రశాంత్, ఇప్ప మొండయ్య, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ దబ్బెట స్వామి, మల్హర్ మండల వ్యవసాయ అధికారి శ్రీజ, ఏఈఓ అనూష తదితరులు పాల్గొన్నారు.
శాసీ్త్రయ పద్ధతిలో తేనెటీగల పెంపకం ఉత్తమం
శాసీ్త్రయ పద్ధతిలో తేనెటీగల పెంపకం చేపట్టడం ద్వారా ఉత్తమ ఆదాయ మార్గాలు పొందవచ్చని అయిత ప్రకాశ్‌రెడ్డి అన్నారు. కాటారం ఏఎంసీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఏఎంసీలో నిర్వహిస్తున్న తేనెటీగల పెంపకం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు.
ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్‌రెడ్డి


