డీసీసీ అధ్యక్షుడిగా బట్టు కర్ణాకర్
భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణానికి చెందిన బట్టు కర్ణాకర్‌ను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం శనివారం నియమించింది. జిల్లాలోని 12 మండలాల నుంచి సుమారు 20 మందికి పైగా డీసీసీ పీఠం కోసం దరఖాస్తు చేసుకోగా కర్ణాకర్‌కు ఈ పదవి దక్కింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈయన 2009 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2011–2016 వరకు ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2016–2023 వరకు ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నందుకు గాను కర్ణాకర్‌కు డీసీసీ పదవి అప్పగించినట్లు తెలిసింది.


