పర్యాటక అభివృద్ధికి కృషి
● జిల్లా అటవీ అధికారి నవీన్ రెడ్డి
రేగొండ: పాండవుల గుట్టలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని జిల్లా అటవీ అధికారి నవీన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రావులపల్లి శివారు పాండవుల గుట్టలను అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాండవుల గుట్టలను సందర్శించే పర్యాటకుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీఓ అప్పలకొండ, ఎఫ్‌ఆర్వోలు నరేష్, చంద్రమౌళి, ఎఫ్‌ఎస్‌ఓ గౌతమి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


