పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు
● అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
భూపాలపల్లి రూరల్/కాటారం(మహాముత్తారం): కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ సెంటర్ల నిర్వాహకులు, పీఏసీఎస్ అధికారులకు సూచించారు. శుక్రవారం భూపాలపల్లి మండలంలోని ఆజాంనగర్, నాగారం, మహాముత్తారం మండలం మీనాజీపేట, బోర్లగూడెంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియ, సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు సమయంలో ఎఫ్‌ఏక్యూ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. అనంతరం మహాముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. మెనూ అమలు చేయకపోవడంపై ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలు సక్రమంగా సరఫరా చేయని నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్‌కుమార్, సహకార అధికారి వాలియానాయక్, పౌర సరఫరాల శాఖ ఆర్ ఐ సురేందర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు.


