ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ఎస్పీలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా ఉన్న కిరణ్ ఖరే (ఐపీఎస్–2017 బ్యాచ్) హైదరాబాద్ సిటీ సౌత్ జోన్ డీసీపీగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో ఏడీసీ టు గవర్నర్‌గా ఉన్న సిరిసెట్టి సంకీర్త్ (ఐపీఎస్–2020) ఎస్పీగా నియమితులయ్యారు. మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌ను ములుగు ఎస్పీగా బదిలీ చేశారు. అక్కడున్న డాక్టర్ శబరీష్‌ను మహబూబాబాద్ ఎస్పీగా నియమించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం అడిషనల్ ఎస్పీగా ఉన్న శివం ఉపాధ్యాయ (ఐపీఎస్–2021) ములుగు జిల్లా ఓఎస్‌డీగా నియమించారు. కొంతకాలంగా ములుగు ఓఎస్‌డీ పోస్ట్ ఖాళీ ఉంది. ఆయన స్థానంలో గ్రేహౌండ్స్ ఏఎస్పీగా ఉన్న మనన్ భట్ (ఐపీఎస్ – 2023)కు ఏటూరునాగారం ఏఎస్‌పీ/ఎస్‌డీపీఓగా పోస్టింగ్ ఇచ్చారు. మేడారం – 2026 మహాజాతర వచ్చే ఏడాది జనవరి 28నుంచి 31 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో ముందుగానే ఐపీఎస్ అధికారుల బదిలీలు, నియామకాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
భూపాలపల్లి ఎస్పీగా సంకీర్త్..
ములుగు ఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్..
ములుగు ఎస్పీ శబరీష్ మహబూబాబాద్‌కు
ఓఎస్‌డీగా శివం ఉపాధ్యాయ
మేడారం జాతర నేపథ్యంలో
ముందుగానే బదిలీలు.. నియామకాలు


