ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థ రక్షణకు సింగరేణి కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలు చేసేందుకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంద నరసింహారావు కోరారు. ఏరియాలోని కేటీకే 5వ గనిలో శుక్రవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రికార్డు స్థాయిలో లాభాలు గడిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు పొందుతూ, నవరత్నం లాంటి సింగరేణి కంపెనీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణిని భవిష్యత్ లేకుండా చేస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి సంస్థను కాపాడేందుకు కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య, నాయకులు తోట రమేష్, బాబురావు, సాయికిరణ్, ప్రసాద్, శివకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.


