కలెక్టర్ వస్తున్నారని తెరిచారు..
సరస్వతినది పుష్కరాల సమయంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో కాళేశ్వరం దేవస్థానం పరిధి వీఐపీఘాట్ వద్ద శాశ్వతంగా మరుగుదొడ్లు నిర్మించారు. ఆర్‌డబ్ల్యూస్ డీఈఈ సెప్టెంబర్ 19న పనులు పూర్తి చేసి దేవస్థానం అధికారులకు అప్పగించారు. వీఐపీ ఘాటులో నిత్యం స్నానాలు చేసే భక్తులతో రద్దీ నెలకొంటుంది. ఇన్ని రోజులు అధికారులు మరుగుదొడ్లకు తాళం వేసి ఉంచారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ వస్తున్నారని తెలుసుకుని తాళాలు తీశారు.
– కాళేశ్వరం


