బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
కాటారం: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ అన్నారు. కాటారం మండలకేంద్రంలోని తిమోతి బాయ్స్ హోంలో జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మయాంక్‌సింగ్ మాట్లాడారు. బాలల హక్కులను కాపాడడానికి ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఉందన్నారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ సమాజంలో బాలలను కాపాడటానికి, బాల కార్మిక వ్యవస్థ, అక్రమ శిశువుల దత్తత, బాలల తదితర సమస్యలను నియంత్రించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ రాధిక, సూపర్‌వైజర్ శివరాణి, సోషల్ వర్కర్ కుమార్, హోం డైరెక్టర్ డేవిడ్ మార్క్, హృదయానంద్, అశోక్, బాలబాలికలు పాల్గొన్నారు.
కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్


