నేను మిర్చి పంటను ప్రతి ఏడాది వేస్తాను. కానీ వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమపై మక్కువ ఉంది. సహజ సిద్ధమైన దానతో పాటు స్వేచ్ఛగా తిరిగేందు కు ఎకరం భూమిలో కోళ్లు పెంచుతున్నా. నాటు కోళ్ల పెంపకంపై దృష్టిపెట్టాను. నా వద్ద నాటు, పందెం కోళ్లు, సోన లాంటి రకాలు ఉన్నాయి. కోళ్లతో నాటు కోడి గుడ్లు విక్రయిస్తున్నాను. త్వరలో కోడి గుడ్లు డెలివరీ కూడా పెడుతున్నాను. కోడిగుడ్లకు డిమాండ్ బాగా ఉంది. ప్రస్తుతం లాభాలు ఆర్జిస్తున్నాను. మూడు రకాల వ్యాక్సిన్‌లు మాత్రం వాడుతున్నా.
– శ్రీపతి బాపు, రైతు, మహదేవపూర్
జీరో డే నుంచి మూడు వ్యాక్సిన్‌లు మాత్రం తప్పనిసరిగా వేయాలి. వ్యాధులు రాకుండా ఉంటుంది. వ్యాక్సిన్‌లు లసోట(ఎన్‌డీ), ఐబీడీ(బూస్టర్), లసోట(ఐఎన్‌డీ)లు వేయాలి. కోళ్ల ఎదుగుదల కూడా బాగుంటుంది. నాటుకోళ్లకు సహజ సిద్ధమైన ఆహారం దానా రూపంలో అందిస్తే ధృడంగా ఉంటుంది. బ్రాయిలర్, లేయర్‌లకు అయితే ఆ కంపెనీలను బట్టి వివిధ రకాల ఇంజక్షన్లు వాడుతారు.
– బుర్ర రాజబాబు,
పశువైద్యాధికారి, మహదేవపూర్
●
నాటు కోడిగుడ్లకు డిమాండ్


