అనర్హులను తొలగించాలని ధర్నా
భూపాలపల్లి అర్బన్: డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల నుంచి అనర్హులను తొలగించాలని డిమాండ్ చేస్తూ బాధితులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుపేద ప్రజలను మోసం చేసిందన్నారు. ధనవంతులకు, ఇళ్లు ఉన్న వారికి ఇళ్లు కేటాయించినట్లు ఆరోపించారు. కలెక్టర్ స్పందించి తక్షణమే విచారణ చేపట్టి అనర్హులను తొలగించాలని డిమాండ్ చేశారు. బాధితుల ధర్నాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ధర్మసమాజ్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు.


