నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యం
రేగొండ: రైతులకు గిట్టుబాటు ధరల్లో నాణ్యమైన విత్తనాలను అందించడమే విత్తనాల ముసాయిదా బిల్లు 2025 లక్ష్యమని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ విజయభాస్కర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లుపైన, బిల్లులోని అంశాలపైన గురువారం మండలకేంద్రంలోని రైతువేదికలో మండల వ్యవసాయాధికారి వాసుదేవారెడ్డి ఆధ్వర్యంలో సలహాలు, సూచనలను రైతులను కోరారు. ఈ సందర్భంగా బిల్లులోని అంశాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి, ములుగు జిల్లాల ఏడీఏలు రమేష్, అవినాష్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకటరాజ్‌కుమార్, డాక్టర్ విశ్వతేజ, డాక్టర్ ప్రశాంత్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.


