కాటారం: తేనెటీగల పెంపకంతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. కాటారం ఏఎంసీ ఆధ్వర్యంలో రైతులకు శాసీ్త్రయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై రైతులకు ఏడు రోజలు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చైర్‌పర్సన్ తిరుమల ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతో పాటు తేనెటీగల పెంపకం చేపడితే ఆర్థిక వనరుగా ఉంటుందన్నారు. పెంపకానికి అయ్యే ఖర్చు ఎన్‌బీబీ ద్వారా సబ్సిడీ పొందే అవకాశం ఉంటుందన్నారు. ఉచిత శిక్షణ శిబిరం ఏడు రోజుల పాటు రైతులకు భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, బొక్కల పోశిరెడ్డి, బొమ్మన భాస్కర్‌రెడ్డి, కుమ్మరి వెంకన్న, మల్లారెడ్డి, ఆత్మకూరి కుమార్‌యాదవ్, పంతకాని మల్లిఖార్జున్ పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి నేడు (శుక్రవారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజన్ ఇందూ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు, ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు 99592 26707 నంబర్‌కు ఫోన్ చేసి ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
నూతన గనులు కేటాయించాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు నూతన బొగ్గు గనులను కేటాయించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింహరావు కోరారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ 20 సంవత్సరాల నుంచి లాభాలు సాధిస్తూ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.80వేల కోట్లు వివిధ రకాల పన్నులు చెల్లించినట్లు చెప్పారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.48వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. ఈ బకాయిలు వసూలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రైవేట్‌సంస్థలకు కేటాయించిన కోయగుడ, సత్తపల్లి బొగ్గు బ్లాక్‌లలో ఇప్పటివరకు బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించలేదని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కంపేటి రాజయ్య, రమేష్ పాల్గొన్నారు.
అనుమానితులు వస్తే సమాచారం ఇవ్వండి
పలిమెల: అనుమానితులు గ్రామాల్లోకి వస్తే సమాచారం ఇవ్వాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ సూచించారు. గురువారం మండలంలోని పంకెనలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడారు. రోడ్డు నిబంధనలు పాటించాలని, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలతో కలిగే నష్టాలను వివరించారు. యువత మత్తుకు దూరంగా ఉండి చదువులవైపు వెళ్లాలని కోరారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో మావోయిస్టులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉన్నారని, గ్రామస్తులు కూడా కొత్త వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వాలన్నారు. అనుమానిత వ్యక్తులను అశ్రయం కల్పించొద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన 10 లీటర్ల గుడుంబాను సీజ్ చేసి ఒకరిపై కేసు నమోదు చేశారు. నంబర్ ప్లేట్ లేని పది వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాదేవ్‌పూర్ సీఐ వెంకటేశ్వర్లు, పలిమెల, మహదేవ్‌పూర్, కాళేశ్వరం ఎస్సైలు రమేష్, పవన్, శశాంక్, తమాషారెడ్డి, సివిల్, టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.


