బంతిపూల సోయగం
మహదేవపూర్ మండలకేంద్రంలోని ఎల్‌ఎన్‌టీరోడ్డులో ఓ రైతు సుమారు 20 ఎకరాల్లో బంతిపూలు సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం బంతిపూలు విరబూసి కనుచూపు మేరలో ఆ దారి వెంట వెళ్తున్న చూపరులను కనువిందు చేస్తున్నాయి. బంతిపూల సోయగం మనస్సును ఆకర్షిస్తుంది. బంతిపూలను ఇక్కడి నుంచి వరంగల్, హైదరాబాద్ పట్టణాలకు ఎగుమతి చేసి విక్రయిస్తున్నారు. – కాళేశ్వరం
తుపాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు మల్హర్ మండలంలోని చెరువులు జలకళలాడుతూ నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వానాకాలం సీజన్‌కు సంబందించి పొలాలు కోశారు. ధాన్యాన్ని కల్లాలకు తరలిస్తున్నారు. యాసంగిలో చెరువుల కింద సాగుచేసే రైతులు ఆనందంతో సీజన్‌కు సిద్ధమవుతున్నారు.
– మల్హర్
చిట్యాల మండలం చల్లగరిగ గ్రామ శివారులో ఓ రైతు మిర్చి పంట వేశాడు. పంట బాగా వచ్చింది. దీంతో రోడ్డు వెంట వెళ్లే ప్రతి ఒక్కరూ అటువైపే చూస్తున్నారు. గమనించిన రైతు పంటకు కనుదిష్టి తగలవద్దని పంట కనపడకుండా చీరలను కట్టాడు. పంటకు రక్షణ కూడా ఉంటుందని అంటున్నాడు.
– చిట్యాల
బంతిపూల సోయగం
బంతిపూల సోయగం


