విద్యార్థులు జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు గ్రంఽథాలయాలను సద్వినియోగం చేసుకుంటూ జీవిత లక్ష్యానికి చేరుకోవాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అధ్యక్షతన గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. లక్ష్యాలను చేరుకోవాలంటే తరగతి పుస్తకాలతో పాటు గ్రంథాలయంలో పుస్తకాలు చదివి విజ్ఞానం సంపాదించుకోవాలని సూచించారు. గ్రంథాలయాలు విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధపడే వారికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఉపాధ్యాయులు తిరుపతి, స్రవంతి, శ్రీకాంత్, గ్రంథాలయ సిబ్బంది చంద్రమౌళి, శారద, రజిత, భాగ్యలక్ష్మి, రాణి, శ్రీనివాస్, ప్రభాకర్, రమేష్, మంజుల, పాఠకులు పాల్గొన్నారు.
కేజీబీవీ తనిఖీ..
కాటారం: కాటారం మండల కేంద్రంలోని కేజీబీవీని గురువారం అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, సౌకర్యాలు, వంటగదిని పరిశీలించారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరుపట్టిక, రికార్డులను తనిఖీ చేసి విద్యాబోధన, మెనూపై ఆరా తీశారు. విద్యార్థులలో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, ఎస్‌ఓ చల్ల సునీత, పంచాయతీ కార్యదర్శి షగీర్‌ఖాన్ ఉన్నారు.
పోషకాహారం అందించాలి
కాళేశ్వరం: విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. గురువారం మహదేవపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ని తనిఖీ చేశారు. కోడిగుడ్ల నాణ్యత పరిశీలించారు. హాస్టల్ ఆవరణను కలియతిరిగి పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థులకు పోషకాహారం అందించాలని, నాణ్యమైన గుడ్లు అందించాలని వార్డెన్‌ను ఆదేశించారు. వారి వెంట మహదేవపూర్ ఎంపీడీఓ ఎ.రవీంద్రనాథ్ ఉన్నారు.
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి


