రైతులకు గన్నీ సంచులు అందించాలి
చిట్యాల: రైతులు పండించిన వరి ధాన్యానికి తేమ శాతం 17 వచ్చిన వెంటనే పీపీసీ ఇన్‌చార్జ్‌లు గన్నీ బ్యాగులు అందించాలని అదనపు కలెక్టర్ ఆశోక్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని అందుకుతండా గ్రామంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీపీసీ ఇన్‌చార్జ్‌లు తప్పనిసరిగా నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని అన్నారు. రైతులు తెచ్చే వరిధాన్యాన్ని ప్రతి రోజు ఖచ్చితంగా పరిశీలించాలని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పౌరసరాఫరాల అధికారి కిరణ్‌కుమార్, డీఎం రాములు, జిల్లా కోఆపరేటివ్ అధికారి, మండల స్పెషల్ ఆఫీసర్ వాల్యునాయక్, తహసీల్దార్ షేక్ ఇమామ్‌బాబా, పీపీసీ సిబ్బంది పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం పరిశీలన
మొగుళ్లపల్లి: మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపీసీ ఇన్‌చార్జ్‌లు తప్పనిసరిగా నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. రైతులు తెచ్చే ధాన్యంలో తేమశాతాన్ని ప్రతిరోజూ ఖచ్చితంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి కిరణ్‌కుమార్, డీఎం రాములు, తహసీల్దార్ సునీత, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ ఆశోక్ కుమార్


