షెడ్యూల్ సిద్ధం చేయాలి
భూపాలపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు మండలాల వారీగా పూర్తి షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. సర్పంచ్ ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా, అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రల అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని గురువారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్, ఎస్పీలు, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా మండలాల వారిగా పూర్తి షెడ్యూల్‌ను తయారు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో శాంతిభద్రతలు, సిబ్బంది కేటాయింపు అంశాలపై ముందస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ కిరణ్‌ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, డీపీఓ శ్రీలత, డీఆర్‌డీఓ బాలకృష్ణ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ


