సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
భూపాలపల్లి రూరల్: సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ పింగిళి విజయపాల్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు సాంకేతిక రంగంలో విద్యాపరంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో శ్రీఎ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్‌శ్రీ అనే పాఠ్యాంశంపై జిల్లాలో పనిచేస్తున్న గణితం, భౌతిక శాస్త్ర స్కూల్ అసిస్టెంట్లకు జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యాపరంగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యాబోధన, బోధన వ్యూహాలు ఉండాలన్నారు. సాంకేతికత శిక్షణ తరగతి గదిలో ఎలా అమలు చేయాలో తెలుసుకోవడానికి ఈ శిక్షణ తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మీప్రసన్న, సతీష్ కుమార్, ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.


