పారదర్శకంగా ఇళ్ల పంపిణీ
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ జరిగిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్‌లో భాస్కరగడ్డ వద్ద నిర్మించిన 416 డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు 409 లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి డ్రా నిర్వహించి కేటాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒత్తిడిలకు లొంగకుండా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లను అందించడం జరిగిందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు అర్హులైన పేదలను గుర్తించి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.


