బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్
మల్హర్: మండలంలోని తాడిచర్ల–పెద్దతూండ్ల గ్రామ శివారు వ్యవసాయ భూముల్లో తాడిచర్ల ఓపెన్‌కాస్ట్–2 ప్రాజెక్ట్ ఏర్పాటునకు సింగరేణి అధికారులు బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్ చేస్తున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శినోమిక్ ఇండియా ప్రైవేట్ లిమి టెడ్ కంపెనీ ప్రతినిధులు ఈ డ్రిల్లింగ్ పనులను చేపడుతున్నారు. 450 మీటర్ల లోతులో డ్రిల్లింగ్ చేస్తే బొగ్గు నాణ్యతను గుర్తించ వచ్చని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇప్పటికే పెద్దతూండ్ల కిషన్‌రావుపల్లిలో డ్రిల్లింగ్ వేశామని, మరో డ్రిల్లింగ్ మల్లారం కస్తూర్భా పాఠశాల ఆవరణలో వేయనున్నట్లు పేర్కొన్నారు.


