సంప్రదాయాలను కాపాడాలి
భూపాలపల్లి అర్బన్: సంప్రదాయాలు, విలువలను కాపాడినప్పుడే కుటుంబాలు బాగుంటాయని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్ దిలీప్‌కుమార్‌నాయక్ తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సబ్ కోర్టు ఆవరణలో బుధవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. వయోవృద్ధుల సంరక్షణ చట్టం, వారి సంక్షేమం అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో జడ్జి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులను వేదించేవారికి ఆస్తులపై హక్కు ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ అక్షయ, సిబ్బంది, వయోవృద్ధుల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.
భూసేకరణకు
సహకరించాలి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో వీఐపీ ఘాటు నుంచి మెయిన్‌ఘాటు వరకు, ఇప్పలబోరు నుంచి వీఐపీ ఘాటు లింకురోడ్డు, ఇతర అభివృద్ధి పనులు చేసేందుకు రైతులు సహకరించాలని కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ తెలిపారు. బుధవారం కాళేశ్వరం పంచాయతీలో రైతులతో స మావేశం నిర్వహించారు. పట్టా, లావణి పట్టా రైతులను రెండు విభాగాలుగా చేశారు. గతంలో సర్వే చేసినప్పటికీ మళ్లీ రైతులకు నోటీసులు అందజేసి రీ సర్వే చేయాలన్నారు. రైతులకు ఏమైన అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా అందించాలన్నారు. అనంతరం కాళేశ్వరం జెడ్పీహెచ్‌ఎస్‌లో మధ్యాహ్న భోజన తయారీని పరిశీలించారు. వారి వెంట కాళేశ్వరం దేవస్థానం ఈఓ మహేష్, తహసీల్దార్ రామారావు, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు
చిట్యాల: పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాఠశాల పరిశుభ్రత 5.0 కార్యక్రమ రాష్ట్ర పరిశీలకుడు, వరంగల్ డైట్ ప్రిన్సిపాల్ అబ్దుల్ హై తెలిపారు. బుధవారం మండలంలోని జూకల్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి పాఠశాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో పరిశుభ్రత– భద్రత చర్యల అమలుపై పలు సూచనలు చేశారు. జిల్లా సీఎంఓ రమేష్, ప్రధానోపాధ్యాయుడు గిరగాని కృష్ణ, తదితరులు ఉన్నారు.
గణపురం: గణపురం మండలకేంద్రంలోని మోడల్ పాఠశాలను రాష్ట్ర స్థాయి పరిశీలకుడు ఎండీ అబ్దుల్ హై, సీఎంఓ రమేశ్, ఎంఈఓ ఎండీ అప్రోజ్ బృందం బుధవారం తనిఖీ చేశారు. పాఠశాలలోని తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, రికార్డుల నిర్వాహణ, మధ్యాహ్న భోజనం, పరిసరాల పరిశుభ్రతలను పరిశీలించారు.
బాల్యవివాహాల
నిర్మూలనపై కళాజాతా
కాళేశ్వరం: మహదేవపూర్, అంబట్‌పల్లి, సూరారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలల్లో కలెక్టర్, డీపీఆర్‌ఓల ఆదేశాల మేరకు మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూల నపై తెలంగాణ సాంస్కృతిక సారథి సెగ్గం శిరీ ష కళా బృందం అవగాహన కల్పించారు. బా ల్యవివాహాలతో కలిగే అనర్థాలను వివరించా రు. ఈ కార్యక్రమంలో కళాకారులు సెగ్గం శిరీషజా డి, సుమలత, పులి రాధిక, ఆత్మకూరు, మ హేందర్, సోదారి సురేందర్, గడ్డం నాగమణి, కాస స్వాతి, ఓనపాకల కుమార్, చిలుముల మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
సంప్రదాయాలను కాపాడాలి


