విజయవంతం చేయాలి
చీరల
పంపిణీని
భూపాలపల్లి అర్బన్: ఇందిరమ్మ చీరల పంపిణీని విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చీరలు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి పకడ్బందీగా మండల వారీగా షెడ్యూల్ తయారు చేయాలన్నారు. కాటారం, భూపాలపల్లి డివిజన్‌లో పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగేందుకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులకు ముందస్తు సమాచారం ఇచ్చి ఆహ్వానించాలని, ఎలాంటి ప్రోటోకాల్ సమస్య రావొద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ బాలకృష్ణ, డీపీఓ శ్రీలత మహిళా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని మహిళా శిశు వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మలు హాజరై మాట్లాడారు. వృద్ధులు సమాజానికి మార్గదర్శకులన్నారు. అనంతరం వయోవృద్ధులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మహిళా, శిశు, వయో వృద్ధుల సంక్షేమ అధికారి మల్లేశ్వరి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామచంద్రమూర్తి, రామచందర్, ఎన్‌జీఓ శ్యాం తదితరులు పాల్గొన్నారు.
పటేల్ కృషితోనే దేశంలో ఐక్యత
భూపాలపల్లి రూరల్: సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన కృషితోనే దేశం నేటికీ ఐక్యతతో ఉందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. బుధవారం డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ క్రీడా ప్రాంగణంలో కేంద్ర యువజన సర్వీసులు క్రీడ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మై భారత్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ సంస్థల ఆధ్వర్యంలో సర్దార్ 150 ఐక్యత పాదయాత్రను కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడారు. పటేల్ స్ఫూర్తితో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ దేశంలో ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని ప్రాంతాలు ఉన్నా అందరం ఒకటేనని చాటి చెప్పారన్నారు. అనంతరం డ్రగ్స్ రహిత దేశంగా తీర్చిదిద్దడానికి కేంద్రప్రభుత్వం చేపట్టిన నషా ముక్తి భారత్ అభియాన్ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్, సూపరింటెండెంట్ బానోతు దేవిలాల్, అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, యువజన క్రీడల శాఖ అధికారి చిర్రా రఘు, సంక్షేమ అధికారి మల్లేశ్వరి, ఉపాధ్యాయులు కృష్ణ మోహన్, నాయకులు కన్నం యుగదీశ్వర్, తాటికొండ రవి కిరణ్, గాలిఫ్, వలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


