కమ్యూనిస్టులు కలిసి ఉద్యమించాలి
భూపాలపల్లి రూరల్: దేశంలో 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ సీపీఐ అని, దేశంలో కమ్యూనిస్టులంతా ఒకే వేదికపై పోరాడి మతతత్వ బీజేపీని గద్దె దించాలని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సీపీఐ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాల సందర్భంగా సీపీఐ బస్సు జాతాను జోడే ఘాటులో ప్రారంభమై జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌కు చేరుకుంది. అంబేడ్కర్ సెంటర్‌లో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఆటపాటలతో అలరించారు. అంతకుముందు మంజూరునగర్‌లో బైక్ ర్యాలీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో శ్రీనివాసరావు మాట్లాడుతూ 100 సంవత్సరాలు ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణి శంకర్, వివి ధ సంఘాల నాయకులు మారుపాక అనిల్ కుమార్, మణికంఠ రెడ్డి, కుమార్, గురిజేపల్లి సుధాకర్ రెడ్డి, పైళ్ల శాంతికుమార్, మోట పలుకుల రమేష్, సతీష్, ప్రవీణ్, సుగుణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
శ్రీనివాసరావు
ఘనంగా సీపీఐ 100 సంవత్సరాల
బస్సు జాతా


