డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

Nov 20 2025 6:58 AM | Updated on Nov 20 2025 6:58 AM

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

భూపాలపల్లి అర్బన్‌: డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు భాగస్వామ్యం కావాలని తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో డీఎస్పీ రమేష్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నార్కోటిక్‌ బ్యూరో డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌లు మాట్లాడుతూ విద్యార్థులు, సిబ్బంది మాదకద్రవ్యాల దుష్పభ్రావాలు, నేర నియంత్రణ, న్యాయ ప్రక్రియపై అవగాహన ఉండాలన్నారు. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. అంతకుముందు డ్రగ్స్‌ నియంత్రణపై రూపొందించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, వైస్‌ ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ రాజేష్‌, డాక్టర్‌ శ్రీధర్‌రావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వేణుగోపాల్‌, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement