రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
భూపాలపల్లి రూరల్: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండలంలోని కొంపల్లి, గుడాడుపల్లి, నేరేడుపల్లి, గొర్లవీడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. అనంతరం గొర్లవీడు గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలో మండల అధ్యక్షుడు సుంకరి రాంచంద్రయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం


