మొర ఆలకించరా..!
మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని సీఎస్‌ఐ కాలనీ చర్చి వెనుకాల ఇళ్ల మధ్యలో పాడు బడిన బావి ఉంది. వర్షం నీరు, చెత్త చెదారంతో బావిలో వ్యర్ధాలు పేరుకుపోయాయి. దీంతో దుర్గంధం, దోమలతో చుట్టు పక్కల ఇళ్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి రంగు మారి దోమల బెడద పెరగడంతో రోగాల బారిన పడుతున్నారు. బావిని పూడ్చాలని పలుమార్లు పాలకులకు, అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
– మొగుళ్లపల్లి


