కోతుల గుంపుతో గుబులు!
రేగొండ: మండల కేంద్రం నుంచి జాకారం వెళ్లే మార్గంలో కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. గుంపులుగా రహదారిపై తిష్టవేసిన కోతులు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, పాదాచారుల వెంట పడి వారి వద్ద ఉండే సరుకుల కవర్లను లాక్కుంటున్నాయి. ఒక్కసారిగా మీదకు వస్తున్న కోతులతో భయాందోళన చెందుతున్నారు. కొందరు ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కింద పడి గాయపడిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన రహదారిపై నెలకొన్న సమస్యలపై అధికారులు దృష్టిపెట్టాలని వాహనదారులు కోరుతున్నారు,


