ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
చిట్యాల: ‘కొనుగోళ్లు ప్రారంభమెప్పుడో’ అని ఈ నెల 16న సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పందించారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
చిట్యాల: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు వీసీకే యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంబాల అనిల్‌కుమార్ మంగళవారం మండలకేంద్రంలో వినతిపత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థుల సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు కనకం ఇతేష్, కృష్ణతేజ, తోట అభినయ్, శివ, హరికుమార్ పాల్గొన్నారు.
కాటారం: యువజన క్రీడా ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీల్లో మండలకేంద్రంలోని కేజీబీవీ, కాటారం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బృంద గీతంలో కేజీబీవీకి చెందిన పరిమళ బృందం ఉత్తమ ప్రదర్శన ఇచ్చి ప్రథమ స్థానంలో నిలవగా.. బృందనృత్య విభాగంలో సౌమ్య బృందం రెండో స్థానంలో, కాటారం జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విజ్ఞా బంజార బృందం డప్పు నృత్యంలో ప్రతిభ కనబరిచింది. పరిమళ బృందం, విజ్ఞా బంజార బృందంను రాష్ట్రస్థాయి యువజన పోటీలకు ఎంపిక చేసినట్లు కేజీబీవీ ప్రిన్సిపాల్ చల్ల సునీత, జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం సోమలింగం తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సీఆర్‌పీఎఫ్ హైదరాబాద్ రేంజ్ డీఐజీ అనిల్ మింగే, కమాండెంట్ ప్రశాంత్ కేఆర్ శ్రీవాత్సవ మంగళవారం సందర్శించారు.
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం


