కుంటలు, చెరువులెన్ని..
ప్రతీ ఐదేళ్లకు ఒకసారి..
బోర్లు, బావుల సంఖ్య ఎంత..
గణనకు ఏర్పాట్లు చేశాం..
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని చిన్న నీటి వనరుల లెక్కింపునకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ప్రతి ఐదేళ్లకోసారి నీటి వనరులను లెక్కిస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. జిల్లాలో వారంరోజుల్లో సర్వే మొదలు కానుంది. జలశక్తి కార్యక్రమంలో భాగంగా జల గణన చేపడుతున్నారు. మ్యానువల్ పద్ధతిలో నీటి వనరులను లెక్కపెట్టి ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు చేస్తారు.
సిబ్బందికి శిక్షణ
జిల్లాలో చిన్న నీటి వనరుల గణన కోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సీపీఓ అధికారులే కాకుండా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సైతం ఈ గణన ప్రక్రియను పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ చైర్మన్‌గా, సీపీఓ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. గ్రామ పరిపాలన అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు చిన్న నీటి వనరుల గణనను చేపట్టనున్నారు. వీరిని సమన్వయం చేసే బాధ్యతను మండలాల వారీగా తహసీల్దార్లకు అప్పగించనున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నిర్వహించే నీటి వనరుల గణన వివరాలను ప్రతీ రోజు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. అనంతరం వాటిని ఉన్నతాధికారులకు అందించనున్నారు.
కబ్జాకు గురైన చెరువులు
వెలుగులోకి రానున్నాయా?
చాలాగ్రామాల్లో పూర్వం నుంచి ఉన్న చెరువుల శిఖం భూములు కబ్జాలకు గురయ్యాయి. చెరువుల లెక్కింపుతో పాటు, చెరువుల శిఖం భూములను లెక్కిస్తే కబ్జాలకు గురైన చెరువులు కూడా వెలుగులోకి రానున్నాయి. కబ్జాలకు గురైన శిఖం భూములను గుర్తించి చెరువులను విస్తరణ చేస్తే చెరువులకు, కుంటలకు పూర్వవైభవం రానుంది.
జలశక్తి కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లకు ఒకసారి చిన్న నీటి వనరులను లెక్కిస్తారు. 2017–18 సంవత్సరంలో నీటి వనరుల గణన నిర్వహించారు. ప్రస్తుతం మళ్లీ చేపట్టేందుకు సీపీఓ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా గొట్టపు బావులు, ఓపెన్ బావులు, చెరువులు, చిన్న పాటి కుంటలు, రెండు వేల హెక్టార్లలోపు భూమికి సాగునీరు అందించే మినీ ప్రాజెక్టులను లెక్కించనున్నారు. అధికారులు వీటన్నింటి వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి అందించనున్నారు. ఈ గణన ద్వారా ఏయే గ్రామంలో ఎన్ని నీటి వనరులు ఉన్నాయనే విషయంతో పాటు గ్రామాల్లో నీటి లభ్యత ఎలా ఉందనే అంశం వెలుగులోకి రానుంది. గణన వివరాలను కేంద్ర జలశక్తి శాఖకు అందించనున్నారు. అధికారులు అందించిన నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం భవిష్యత్‌లో రాష్ట్ర నీటి వనరుల రంగానికి వివిధ స్కీంల కింద ఆర్థిక సహకారం అందించనుంది.
రేపటి నుంచి
చిన్న నీటి వనరుల లెక్కింపు
నెలరోజుల పాటు
కొనసాగనున్న కార్యక్రమం
సర్వేకు షెడ్యూల్
ఖరారు చేసిన ప్రభుత్వం
చిన్న నీటి వనరుల గణన వారంరోజుల్లో జిల్లాలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇందుకు సంబంధించి మూడు రోజుల పాటు సిబ్బందికి శిక్షణ అందిస్తున్నాం. నెల రోజుల్లో నీటి వనరుల గణన పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. – బాబురావు, సీపీఓ
కుంటలు, చెరువులెన్ని..


