నందీశ్వరా.. నమస్తుభ్యం
కాశీ నుంచి నందీశ్వరుని పూజకు..
నందీశ్వరుడి అభిషేక పూజ కోసం ఉత్తరప్రదేశ్‌లోని కాశీ నుంచి తేజశ్విని అనే మహిళ వచ్చింది. బహుళ త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి అభిషేక పూజలు చేస్తున్న విషయం తెలుసుకొని పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
పూలతో నందీశ్వరుడిని ముస్తాబు చేస్తున్న ఆలయ ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ, నందీశ్వరుడికి సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు చేస్తున్న అర్చకుడు, పూజ తంతును తిలకిస్తున్న భక్తులు
కాళేశ్వరం: కార్తీకమాసం చివరి సోమవారం బహుళ త్రయోదశి సందర్భంగా తూర్పు దిక్కున నందీశ్వరుడికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం, విశేష పూజలను శాస్త్రోక్తంగా పండితులు వైభవంగా నిర్వహించారు. సోమవారం ప్రదోషకాల సమయంలో దేవస్థానం ఉప ప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో పండితులు అభిషేక పూజల తంతును నిర్వహించారు. సాయంత్రం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు అర్చకులు పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆలయంలో మొదటిసారిగా నిర్వహిస్తుండడంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఎంతో భక్తితో భక్తులు గంటన్నరపాటు పూజతంతును తిలకించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అన ంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ప్రసాద వితరణ చేశారు. భక్తులు భారీగా తరలిరావడంతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఏకాదశ రుద్రుడే నందీశ్వరుడు..
ఏకాదశ రుద్రుడే నందీశ్వరుడని డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్‌శాస్త్రి భక్తులకు ప్రవచనాలు వినిపించారు. మహాశివుడికి ప్రియభక్తుడు నందీశ్వరుడని తెలిపారు. కార్తీకమాసం బహుళ త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడిని కొలిస్తే మహాశివుడు సంతృప్తి చెందుతాడన్నారు. నందీశ్వరుడికి అభిషేకం చేస్తే పాహరణం జరుగుతుందని చెప్పారు. అరుణాచలంలో నందీశ్వరుడికి అభిషేక పూజలు చేస్తారని, ఇప్పుడు కాళేశ్వరంలో నందీశ్వరుడికి అభిషేకం నిర్వహించడం ఎంతో శుభపరిణామం అన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ మహేష్, అర్చక బృందాన్ని అభినందించారు.
● పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం
● శాస్త్రోక్తంగా గంటపాటు
భక్తుల విశేష పూజలు
నందీశ్వరా.. నమస్తుభ్యం
నందీశ్వరా.. నమస్తుభ్యం
నందీశ్వరా.. నమస్తుభ్యం


