ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు
గణపురం: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మండలకేంద్రంలోని కాకతీయుల కళా క్షేత్రం (గణపేశ్వరాలయం) కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి భక్తులు తెల్లవారు జాము నుంచే పెద్దఎత్తున పోటెత్తారు. ఉదయం నుంచే స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని నాగభరణం, పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధనలు చేశారు. ఆలయ గోశాలలో గో మాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు నాగరాజు తీర్థ ప్రసాదాలు అందచేశారు.
కోటగుళ్లలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు
ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు


