భూపాలపల్లి: ఆకర్షణీయమైన ప్రకటనలకు మోసపోకుండా సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కిరణ్ ఖరే సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లు, వెబ్‌సైట్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలు అధికంగా నమోదవుతున్నాయన్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్, ఈమెయిల్ వంటి వేదికల ద్వారా ఆకర్షణీయమైన లింకులు పంపడం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు, త్వరిత రిటన్స్ వంటి వాగ్దానాలతో పెట్టుబడిదారులను నమ్మబలికి మోసం చేస్తారన్నారు. ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే పోలీసులకు లేదా 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు.
ఎస్పీ కిరణ్ ఖరే


