చలి చంపేస్తోంది..
వారం రోజులుగా గోదావరి తీర ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. చలికి మనుషులతో పాటు ఏ జీవరాశి కూడా తట్టుకోవడం లేదు. పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుతూ..రాత్రికి 13–14 డిగ్రీలకు చేరుతుంది. దీంతో మహదేవపూర్ మండలంలో నిర్మించిన అన్నారం(సరస్వతి బ్యారేజీ) వద్ద శనివారం రాత్రి చలికి వణికిపోతూ వానరాల గుంపు దర్శనమిచ్చింది. అడవిలో ఉండాల్సిన వానరాలు బ్యారేజీ వంతెనపై రాత్రిపూట చలికి గజగజ వణికిపోతూ తన పిల్లలను ఒడిలో హత్తుకుపెట్టుకొని బతుకు జీవుడా అంటూ ప్రయాణికులకు కనిపించాయి. అయ్యో! మాకు కూడా చలేస్తుంది అన్నట్లుగా వానరాలు వణుకుతూ అటుగా వెళ్తున్న చూపరుల మనస్సు చలించుకుపోయేలా కనిపించాయి. – కాళేశ్వరం
అన్నారం బ్యారేజీపైన రాత్రి చలికి వణికిపోతూ తన పిల్లలను ఒడిలో పెట్టుకున్న వానరాలు


