సాగులో నాలుగేళ్లుగా మార్పులు
సాగు వివరాలు (ఎకరాల్లో..)
వరి మిర్చి
1,13,376
1,10,899
24,360
19,636
17,377
9,521
1,05,000
98,600
● వర్షాలు, తెగుళ్ల కారణంగా మిరపపై రైతుల అనాసక్తి
● నీటి వనరులు పెరగడంతో వరి వైపు మొగ్గు
సంవత్సరం
2022 2023 2024 2025
భూపాలపల్లి రూరల్: జిల్లాలో నాలుగేళ్లుగా వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అంతకు ముందు వరితో పాటు మిర్చి సాగు ఎక్కువగా ఉండేది. నాలుగేళ్లుగా మిర్చి పంట సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. అకాల వర్షాలు, తెగుళ్లు, ఇతర కారణాలతో గిట్టుబాటు రాక నష్టాలు చవిచూసిన రైతులు.. ఇప్పుడు వరి సాగుపై మక్కువ చూపుతున్నారు. నీటి వనరులు పెరగడం, వరికి క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2300 వరకు ఉండడం, రూ.500 బోనస్ చెల్లించడం, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండడంతో రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ధాన్యం కూడా ఎకరాకు 24 నుంచి 26 క్వింటాళ్ల దిగుబడి వస్తూ రైతులకు సిరులు కురిపిస్తోంది.
నీటి వనరులు పెరగడమే కారణం..
జిల్లా వ్యాప్తంగా నాలుగేళ్లుగా నీటి వనరులు పెరిగాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు వృద్ధి చెంది బోరు బావుల్లో నీటి మట్టాలు పెరిగి నీటి వనరులు పెరిగాయి. సాగునీటి సమస్య లేకుండా పోయింది. దానికి తోడు వానాకాలం సీజన్‌లో అనువైన వర్షాలు కురుస్తున్నాయి. ధాన్యం అమ్మకం కోసం కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని జిల్లాలో రైతులు వరి సాగును ఏటేటా పెంచుతూ వస్తున్నారు.
సన్నాల సాగుపై మక్కువ..
జిల్లాలో రైతులు సన్నాల సాగుపై దృష్టి సారిస్తున్నారు. రెండు, మూడేళ్లుగా సన్నాలైన చిట్టిపొట్టి, బీపీటీ, చింట్లు తదితర సన్నరకాలను సాగు చేయడంపై ఆసక్తి చూపుతున్నారు. సన్నాలను తేమ శాతం ఎక్కువ ఉన్నా మిల్లర్లే మద్దతు ధర కంటే ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తుండడంతో.. జిల్లాలో రైతులు సాగు చేస్తున్న వరిలో 60 శాతం వరకు సన్నాలే ఉండడం గమనార్హం. ప్రభుత్వం సన్నాలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో సన్నాల సాగు గణనీయంగా పెరిగింది.
సాగులో నాలుగేళ్లుగా మార్పులు
సాగులో నాలుగేళ్లుగా మార్పులు


