కార్తీక శోభ
కాళేశ్వరం: కార్తీకమాసం ఆదివారం సెలవురోజు సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల గుండా భక్తులు భారీగా తరలివచ్చారు. త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి మాతను మొక్కులు చెల్లించి అరటి దొప్పల్లో దీపాలు వదిలారు. సైకత లింగాలు చేసి పసుపు, కుంకుమతో కొబ్బరికాయలు కొట్టి పూజించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీ సుభానందదేవి అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. అభిషేక మండపంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ప్రాకార దేవతలను దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్‌లో భక్తులు బారులుదీరారు. ఉసిరి చెట్టు వద్ద మహిళలు ప్రదక్షిణలు చేసి దీపారాధనలు చేశారు. లక్ష ముగ్గులు వేసి, లక్ష వత్తులు వెలిగించారు. సుమారుగా 30వేల మంది వరకు భక్తులు దర్శనాలు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ సందర్భంగా వివిధ పూజలు, లడ్డు ప్రసాదాల ద్వారా ఆలయానికి రూ.4.40 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయవర్గాలు తెలిపారు. సాయంత్రం త్రివేణి సంగమం వద్ద గోదావరికి హారతి కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు.
● సెలవురోజు కావడంతో
ఆదివారం పోటెత్తిన భక్తులు
● సుమారు 30వేల మంది దర్శనం
కార్తీక శోభ
కార్తీక శోభ
కార్తీక శోభ
కార్తీక శోభ


