ఘనంగా ప్రతిష్ఠాపన వేడుకలు
ఆలయ గోపురంపై శతకుంభాభిషేకం
గణపురం: మండలకేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆదివారం శ్రీ గణపతి, శివలింగ, నవగ్రహ అష్టబలి పీఠ శతకుంబాభిషేకం మహోత్సవం ఘనంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ప్రతిష్ఠాపన కార్యక్రమాలలో భాగంగా ఆదివారం ఉదయం మహా పూర్ణహోమంతో పూజలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. గణపతి, నాగలింగేశ్వర, శివలింగ, నందీశ్వర, అష్టబలపీరాలను ప్రతిష్ఠాపన చేశారు. అనంతరం పట్టాభిసీతారామ చంద్ర స్వామి ఆలయానికి శత కుంభాషేకం నిర్వహించారు. వేదపండితులు శ్రీనివాస చార్య పరాచర బట్టర్, అరుణాచారి బట్టర్, ఆలయ అర్చకులు నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగగా భక్తులు వేలాదిగా తరలి వచ్చారు.
ఘనంగా ప్రతిష్ఠాపన వేడుకలు


