జాతరలోపు పనులు పూర్తిచేయాలి
గణపురం: గాంధీనగర్ నుంచి జంగాలపల్లి వరకు నిర్మిస్తున్న నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులు మేడారం జాతరలోపు పూర్తిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశించారు. ఆదివారం గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో రూ.25 కోట్లతో గాంధీనగర్ నుంచి జంగాలపల్లి వరకు నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే జనవరి మాసంలో జరిగే మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృషితో కోట్ల రుపాయల నిధులు మంజూరు చేశారన్నారు. అందులో భాగంగా గాంధీనగర్ నుంచి జంగాలపల్లి వరకు రూ.25 కోట్ల రూపాయలతో నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులు ముందస్తుగా ప్రారంభించినట్లు చెప్పారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


