మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్‌బాబు
కాటారం: బైక్‌ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి తీవ్రగాయాలపాలైన ఘటన కాటారం మండల కేంద్రానికి సమీపంలో నూతన పెట్రోల్ పంపు వద్ద చోటు చేసుకుంది. సంజీవ్ అనే రైతు ధన్వాడ వైపు ఉన్న తన పత్తి చేను వద్దకు వెళ్లి బైక్‌పై వస్తున్నాడు. పెట్రోల్‌పంపు సమీపంలోకి రాగానే మంథని వైపుగా వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. సంజీవ్‌కు తీవ్రగాయాలయ్యాడు. ఆ మార్గంలో వెళ్తున్న మంత్రి శ్రీధర్‌బాబు రోడ్డు ప్రమాదాన్ని గమనించి వెంటనే తన కాన్వాయి నిలిపేశారు. మంత్రి దగ్గర ఉండి పోలీస్ వాహనంలో చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని తరలించారు.
పుస్తక పఠనంతో విజ్ఞానం
రేగొండ: పుస్తక పఠనంతో విజ్ఞానం పెరుగుతుందని, జ్ఞాన సముపార్ఙనకు పుస్తకాలు ఎంతో దోహదపడుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం కొత్తపల్లిగోరి మండలకేంద్రంలో తాత్కాలిక భవనంలో ఏర్పాటుచేసిన గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజాబాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తకం సమాజాన్ని మారుస్తుందన్నారు. పుస్తకాలు చదవడం వలన ఎందరో గొప్పవారయ్యారని తెలి పారు. పిల్లలు పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, కోటంచ ఆలయ చైర్మన్ భిక్షపతి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
నేటినుంచి
తరగతులు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు నేటినుంచి (ఆదివారం) దూరవిద్య తరగతులు ప్రారంభిస్తున్నట్లు స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ రుక్సానా మహమ్మద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులకు 1 సెమిస్టర్, 3 సెమిస్టర్, 5వ సెమిస్టర్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని కోరారు.
రేపటినుంచి
కొనుగోళ్లు బంద్
భూపాలపల్లి రూరల్/చిట్యాల: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి జిన్నింగ్ మిల్లుల విషయంలో విధించిన నిబంధనలను సడలించే వరకు ఈనెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ చేస్తున్నట్లు జిల్లా మార్కెంగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని రైతులు గమనించి సోమవారం నుంచి సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకురావద్దని చెప్పారు. కొనుగోళ్ల విషయంలో మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు రైతులు ఓపికగా ఉండాలని కోరారు.
జాతర ట్రస్టుబోర్డు కమిటీని నియమించాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర ట్రస్టుబోర్డు కమిటీని నియమించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పాయం కోటేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో జాతర ట్రస్టుబోర్డు కమిటీని నియమించకుండా తాత్కాలిక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయని మండిపడ్డారు. ఈ సారి జాతరకై నా ప్రభుత్వం స్పందించి ట్రస్టుబోర్డు కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. జాతరలో అమ్మవార్లకు భక్తులు కానుకల రూపంలో సమర్పించే ఆదాయాన్ని దేవాదాయశాఖ తీసుకుని ఆదివాసీ ప్రజలను, పూజారులను విస్మరిస్తుందన్నారు. ఈ సమావేశంలో గిరిజన అభ్యుదయ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముద్దబోయిన రవి, నాయకులు పూర్ణ, నియోజకవర్గ అధ్యక్షుడు కొప్పుల జగన్నాధరావు, మహిళ జాక్ చైర్మన్ శమంతకమణి, మాల్కం రాధిక, మండల అధ్యక్షులు మోకాళ్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్‌బాబు
మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్‌బాబు


