కాళేశ్వరంలో భక్తుల సందడి
కాళేశ్వరం: కార్తీకమాసం శనివారం ఏకాదశి సందర్భంగా శనివారం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యా స్నానాలు ఆచరించారు. గోదావరి మాతను దర్శించుకొని దీపాలు వదిలారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీ సుభానందదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు చేశారు. ప్రత్యేక మండపంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ప్రాకార దేవతలకు మొక్కులు చెల్లించారు. ఉసిరి చెట్టు వద్ద ప్రదక్షిణలు చేసి దీపారాధనలు చేశారు. లక్ష ముగ్గులు వేసి లక్ష వత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా వివిధ పూజలు, లడ్డు ప్రసాదాల ద్వారా ఆలయానికి రూ. 4.50 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు.
కాళేశ్వరంలో భక్తుల సందడి
కాళేశ్వరంలో భక్తుల సందడి


